లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు మంత్రుల శాఖలను మార్చుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి లిండా రెనాల్డ్స్‌ను ప్రభుత్వ శాఖల మంత్రిగా మార్చారు. రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు తనపై అత్యాచారం చేశారని అదే శాఖకు చెందిన యువ ఉద్యోగిని ఒకరు లిండాకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. పైగా ఆమెను అబద్ధాల కోరు అని విమర్శించారు. దీనిపై విమర్శలు రావడంతో ప్రధాని స్పందించి లిండా శాఖను మార్చారు. రక్షణ మంత్రిగా పీటర్ డట్టన్‌ను నియమించారు.
అటార్నీ జనరల్ క్టిస్టియన్ పోర్టర్‌ను పరిశ్రమల శాఖకు మార్చారు. 33 ఏళ్ల క్రితం.. పోర్టర్ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం బాధితురాలు మరణించింది. పోలీసులు కూడా ఎలాంటి దర్యాప్తు చేయలేదు. అయితే ఆమె రాసినట్లు భావిస్తున్న లేఖ ఒకటి గత నెలలో వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి నేరం చేయలేదని చెప్పినా విమర్శలు కొనసాగాయి. దాంతో తన మానసిక ఆరోగ్యం బాగులేదంటూ పోర్టర్ సెలవు పెట్టారు. అయినా ప్రధాని ఆయన పదవి మార్చారు.
ఇదీ చదవండి: ఇండోనేషియా చర్చి దాడిలో ఉగ్రవాద దంపతులు!