ETV Bharat / international

మహిళపై అత్యాచారం- ప్రధాని క్షమాపణ - ఆఫీసులో అత్యాచారం

ఓ అత్యాచారానికి సంబంధించి అస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్ క్షమాపణలు చెప్పారు. రెండేళ్ల క్రితం ఆ దేశ పార్లమెంట్​లోని మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు తనపై సహోద్యోగి అత్యాచారం చేశాడని స్వయంగా ఆ మహిళ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధాని బాధితురాలుకు క్షమాపణలు చెప్పారు.

Australian PM apologises to ex-staffer alleging rape at work
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మహిళపై అత్యాచారం.. ప్రధాని క్షమాపణ
author img

By

Published : Feb 16, 2021, 3:33 PM IST

ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్‌ వేదికగా ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. సమావేశానికి రమ్మని పిలిచి తోటి ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పిన ప్రధాని ఆమెకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

దాదాపు రెండేళ్ల క్రితం 2019 మార్చిలో పార్లమెంట్‌లోని రక్షణమంత్రి లిండా రెనాల్డ్‌ కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ తాజాగా బయటపెట్టారు. ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. ఘటన గురించి ఆ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే తాను పోలీసులకు చెప్పానని, అయితే తన కెరీర్‌ను దెబ్బతీస్తారని భయపడి అధికారికంగా ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. రెనాల్డ్‌ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ సిబ్బంది ఒకరు సమావేశం ఉందని పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించారు. మహిళ వ్యాఖ్యలపై రక్షణమంత్రి రెనాల్డ్‌ స్పందిస్తూ.. అత్యాచారంపై పోలీసులకు చెప్పిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే కేసు పెట్టకుండా తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని మహిళే స్వయంగా చెప్పారని అన్నారు.

ఈ ఘటన గురించి తెలియగానే ప్రధాని స్కాట్‌ మోరిసన్‌.. బాధిత మహిళకు క్షమాపణలు తెలియజేశారు. 'ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' అని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఆసీస్​ జాతీయ గీతంలో మార్పు- కారణమిదే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.