ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చు: ఇద్దరు మృతి.. ఆందోళనలో ప్రజలు - తాజా ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు చల్లారడం లేదు. మంగళవారం న్యూ సౌత్​వేల్స్​లోని దక్షిణ తీర ప్రాంతంలో కార్చిచ్చు రాజుకోగా ఇద్దరు మరణించారు. ప్రజలు భయాందోళనతో పక్కనే ఉన్న బీచ్​ ప్రాంతంలోకి పరుగులు తీశారు.

australia
ఆస్ట్రేలియా కార్చిచ్చు
author img

By

Published : Dec 31, 2019, 11:27 PM IST

ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభ కల్గిన విక్టోరియా, న్యూ సౌత్​ వేల్స్​లోని దక్షిణ తీర ప్రాంతానికి కార్చిచ్చు విస్తరించింది. ఈ దావాగ్నికి ఇద్దరు వ్యక్తులు ఆహుతవగా... ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అధిక సంఖ్యలో ఇళ్లు దగ్ధమవగా...భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇదీ జరిగింది.

న్యూ సౌత్​వేల్స్​లోని దక్షిణ తీర ప్రాంతంలోని సిడ్నీ, మెల్​బోర్న్​ నగరాలకి అనుసంధానించే ప్రిన్సెస్​ రహదారి పక్క కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. దీంతో ప్రజలు భయాందోళనతో... తమ ఇళ్లలో నుంచి పక్కనే ఉన్న బీచ్​ ప్రాంతంలోకి పరుగులు తీశారు. మంటలు అంటుకున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లో చిక్కుకుపోవడం వల్ల దావాగ్నికి ఆహుతయ్యారు.

సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకున్నాయి.

మరో పక్క విక్టోరియా రాష్ట్రంలోనూ గాలులకు అగ్నికీలలు ఎగసిపడి పరిస్థితి మరింత భయానకంగా మారింది.

కొద్ది నెలలుగా విస్తరిస్తోన్న కార్చిచ్చు ధాటికి ఇప్పటి వరకు 12 మంది బలైనట్లు అధికారులు వెల్లడించారు. 1000కు పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఇదీ చదవండి:ఈ రైలు వచ్చిందంటే పట్టాలపై మంచు క్లియర్

New Delhi, Dec 31 (ANI): Bharatiya Janata Party (BJP) and Aam Aadmi Party (AAP) have kickstarted their election campaign in Delhi. Posters have been put up claiming credit of providing possession letters to 40 lakh people residing in unauthorized colonies by BJP. The poster bears the face of Prime Minister Narendra Modi. On the other hand, a huge poster was seen at ITO claiming that none of the colonies are being authorized. The poster also states that '40 lakh people have been duped'.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.