ETV Bharat / international

ఆస్ట్రేలియాపై భారీగా సైబర్‌ దాడులు- ఆ దేశం పనే!

author img

By

Published : Jun 19, 2020, 2:34 PM IST

ఆస్ట్రేలియా సైబర్ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​ తెలిపారు. దీని వెనుక ఓ దేశ హస్తముందని ఆరోపించారు​. అయితే ఏ దేశమన్నది వెల్లడించలేదు. దాడి జరుగుతున్న తీరు ఆధారంగా రష్యా, ఉత్తర కొరియాను ఉద్దేశించే మోరిసన్​ ఆరోపణలు చేశారని నిఘా విభాగానికి చెందిన అధికారులు వివరించారు.

Australia under sophisticated cyber attack PM Scott Morrison
ఆ దేశంపై భారీగా సైబర్‌ దాడులు.. చైనాపై అనుమానం!

ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ ఎత్తున సైబర్‌ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ వెల్లడించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై అత్యాధునిక పద్ధతుల్లో సైబర్‌ దాడికి పాల్పడుతున్నారని తెలిపారు. ఓ దేశ మద్దతుతోనే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, అది ఏ దేశం అన్నది మాత్రం వెల్లడించలేదు. రాజకీయ, పారిశ్రామిక, ప్రభుత్వ, విద్య, వైద్య, అత్యవసర సేవలు, మౌలిక వసతులు ఇలా అన్ని రంగాలకు చెందిన సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

చైనా-ఆస్ట్రేలియా మధ్య గత కొన్ని నెలలుగా సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ ఏమైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందించడానికి ఆయన నిరాకరించారు. నిఘా విభాగానికి చెందిన కొంత మంది అధికారులు మాత్రం రష్యా, ఉత్తర కొరియాలను ఉద్దేశించే మోరిసన్‌ ఆరోపణలు చేశారని వివరించడం గమనార్హం. దాడి జరుగుతున్న తీరు, వారు ఎంచుకుంటున్న మార్గాలు, లక్ష్యంగా చేసుకున్న సమాచారాన్ని బట్టి చూస్తే కచ్చితంగా దీని వెనుక ఓ దేశ ప్రభుత్వ అండ ఉన్నట్లు స్పష్టమవుతోందని మోరిసన్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: మాస్కు లేదని విమానం నుంచి దింపేసిన సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.