ETV Bharat / international

భారత్​ విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం

author img

By

Published : Apr 27, 2021, 12:19 PM IST

కరోనా వేళ భారత్ విమానాలపై మే 15 వరకు నిషేధం విధించింది ఆస్ట్రేలియా. అలాగే భారత్​కు​ సాయంగా తమ వంతు సాయం చేస్తామని ప్రకటించింది.

Australia PM, Scott Morrison
ఆస్ట్రేలియా ప్రధాని, స్కాట్​ మారిసన్

భారత్​లో కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించగా.. తాజాగా ఆస్ట్రేలియా ఈ జాబితాలో చేరింది. మే 15 వరకు ఇరు దేశాల విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్​ మారిసన్​​​ ప్రకటించారు. పరిస్థితుల ఆధారంగా మే 15లోపు దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కేబినెట్​ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మారిసన్​​​. భారత్​కు సాయంగా ఎటువంటి వైద్యపరికరాలు పంపాలన్న విషయంపైనా ఈ భేటీలో చర్చించినట్లు చెప్పారు. అలాగే ఆ దేశ విదేశీ వ్యవహారాలు, రవాణా శాఖలో రిజిస్టర్​ అయిన 9000 మంది ఆస్ట్రేలియన్లు.. భారత్​లో ఉన్నట్లు తెలిపారు. వారిని తిరిగి తమ దేశానికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారత్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది: టెడ్రోస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.