ETV Bharat / international

కొవాగ్జిన్​కు ఆస్ట్రేలియా అధికారిక గుర్తింపు - కొవాగ్జిన్​

భారత్​ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్​ టీకాను(covaxin latest news) ఆస్ట్రేలియా అధికారికంగా గుర్తించింది. ఈ కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది.

Australia recognises India's Covaxin
కొవాగ్జిన్​కు ఆస్ట్రేలియా అధికారిక గుర్తింపు
author img

By

Published : Nov 1, 2021, 1:44 PM IST

Updated : Nov 1, 2021, 6:19 PM IST

భారత్​ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్​ను(covaxin latest news) ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులకు తమదేశంలో ప్రవేశించేందుకు అనుమతి ఉందని తెలిపింది. ఈమేరకు ఆస్ట్రేలియా ఔషధ, వైద్య పరికరాల నియంత్రణ సంస్థ- థెరపీటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్​(TGA) అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా గుర్తించింది.

కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రభావవంతమైన టీకాల అదనపు సమాచారాన్ని ఇటీవలే సేకరించింది టీజీఏ. ఈ వివరాలను పరిశీలించింన అనంతరం కొవాగ్జిన్​(covaxin news), చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కరోనా వ్యాక్సిన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల వ్యాక్సిన్​ స్టేటస్​ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ టీకా​ తీసుకున్న 12ఏళ్లు పైబడిన వారు, బీబీఐబీపీ టీకా తీసుకున్న 18-60 ఏళ్ల మధ్య వయస్సుల వారు ఆస్ట్రేలియా వెళ్లవచ్చు.

ఆ దేశాలు కూడా..

కొవాగ్జిన్​కు మరో ఐదు దేశాలు కూడా అధికారిక గుర్తింపునిచ్చాయి. ఈస్టోనియా, కిర్గిస్థాన్​, పాలెస్తీనా, మౌరిషస్​, మంగోలియాలు గుర్తింపునిచ్చినట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

కొవాగ్జిన్​ టీకాను భారత్​ సహా చాలా దేశాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. వ్యాక్సిన్​ను డబ్ల్యూహెచ్​ఓ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇదీ చదవండి: జపాన్​లో అధికార పార్టీదే విజయం- ఆర్థిక విధానాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Last Updated : Nov 1, 2021, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.