ETV Bharat / international

కార్చిచ్చు: ఆసిస్​కు 3 దేశాల నుంచి 200కు పైగా సిబ్బంది - కార్చిచ్చు తాజా వార్తలు

కార్చిచ్చు ధాటికి అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ఆస్ట్రేలియా హడలిపోతోంది. గత ఏడాది సెప్టెంబర్​లో అంటుకున్న కార్చిచ్చు గ్రామాలకు గ్రామాలను బూడిద చేస్తోంది. హెక్టార్ల కొద్ది భూమి తగలబడుతోంది. శుక్రవారం విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, దక్షిణ, పశ్చిమ ఆస్ట్రేలియాలో మంటలు ఎక్కువకావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. అమెరికా, కెనడా, న్యూజీలాండ్​ నుంచి 2 వందలకు పైగా సిబ్బంది ఆస్ట్రేలియా చేరుకున్నారు.

aus wildfire latest updates
ఆస్ట్రేలియా కార్చిచ్చు: వ్యాపిస్తున్న మంటలు.. ప్రభావిత ప్రాంతాలు ఖాళీ..
author img

By

Published : Jan 10, 2020, 5:58 PM IST

ఆస్ట్రేలియా కార్చిచ్చు: వ్యాపిస్తున్న మంటలు.. ప్రభావిత ప్రాంతాలు ఖాళీ..

ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించివేస్తోంది. దానవాలం ధాటికి అనేక వన్యప్రాణుల జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఈ దావాగ్నికి ఇప్పటివరకు 26మంది బలయ్యారు. ఆరు మిలియన్ హెక్టార్ల భూమి తగలబడింది. 2వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి.

విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, దక్షిణ, పశ్చిమ ఆస్ట్రేలియాలో కార్చిచ్చు తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విక్టోరియాలో వేడి గాలులతో కూడిన పరిస్థితులు భారీ మంటలకు కారణమవుతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం విక్టోరియాలో సుమారు 23 చోట్ల, న్యూ సౌత్ వేల్స్​లో 135 చోట్ల మంటలు వ్యాపించినట్లు స్థానిక అత్యవసర నిర్వహణ విభాగం తెలిపింది.

మూడు దేశాల నుంచి 200పైగా సిబ్బంది

మంటలు ఆర్పేందుకు ఆస్ట్రేలియా ఫైర్​ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారికి సాయం చేసేందుకు యూకే నుంచి ప్రత్యేక నిపుణుల బృందం ఆస్ట్రేలియాకు బయలుదేరింది. అమెరికా నుంచి వచ్చిన ఫైర్​ సిబ్బంది శుక్రవారం సిడ్నీకి చేరుకున్నారు. అమెరికా, కెనడా నుంచి 70మంది, న్యూజిలాండ్​ నుంచి 157 మంది ఫైర్​ సిబ్బంది కంగారు దేశానికి సాయం చేసేందుకు వచ్చారు.

విక్టోరియా ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్​కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Intro:Body:

Yamraj temple

Mandya: Yamraj is thought as the owner of death or who ends the life chapter. Usually no one will worship him. Even if did, Its very rare. We can never find any temple in state. But A devotee is building temple for Yamaraj.

Raju, from Bore ananduru village in Srirangapattana taluk of Mandya district is the one who is going to build Yamaraj temple. He was preparing for constructing temple in the site he purchased. But some people destroyed it . Thus the idole which was to be placed on january 18 is left pending still.

Raju had already constructed Shani temple in Shanisingapura shinimahamathma temple. And now Yamaraj will be placed and worshiped beside this temple. Even some other devotees are in support with devotee raju. And He requests public that even yamaraj is hindus god he must be worshipd.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.