ETV Bharat / international

వాకీటాకీలతో సూకీకి ఉచ్చు బిగిస్తున్న సైన్యం! - Myanmar military coup

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతల అక్రమ నిర్బంధాలను సమర్థించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది మయన్మార్​ సైన్యం. అధికార పార్టీ నేత ఆంగ్​ సాన్​ సూకీ, అధ్యక్షుడు విన్ మింట్​పై తొలిసారి కేసులు నమోదు చేసింది. మరోవైపు... సైనిక చర్యకు మద్దతుగా పరోక్ష వ్యాఖ్యలు చేసింది చైనా.

Aung San Suu Kyi
వాకీటాకీలతో సూకీకి ఉచ్చు బిగిస్తున్న సైన్యం!
author img

By

Published : Feb 3, 2021, 7:13 PM IST

మయన్మార్​లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అధికార పార్టీ నేతలను దిగ్బంధించిన సైన్యం... తన చర్యలను సమర్థించుకునేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. నేషనల్​ లీగ్​ ఫర్​ డెమొక్రసీ అగ్రనేత, నోబెల్ గ్రహీత ఆంగ్​ సాన్​ సూకీని నిర్బంధించడానికి కారణంగా చూపుతూ ఓ సరికొత్త కేసును తెరపైకి తీసుకొచ్చింది. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు కలిగి ఉన్నారని ఆమెపై కేసు బనాయించింది.

ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారని మయన్మార్​ అధ్యక్షుడు విన్​ మింట్​పైనా సైన్యం కేసు పెట్టింది. తద్వారా ఇద్దరు అగ్రనేతలను కనీసం ఫిబ్రవరి 15వరకు నిర్బంధంలోనే ఉంచేందుకు న్యాయపరంగా మార్గం సుగమం చేసుకుంది.

చైనా తీరే వేరు!

మయన్మార్​లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తుంటే... చైనా మాత్రం భిన్నంగా స్పందించింది. సైనిక చర్యను ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం చేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజం చేపట్టే చర్యలు మయన్మార్​లో ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉండకూడదని వ్యాఖ్యానించింది చైనా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.