ETV Bharat / international

'కర్తార్​పుర్'​పై దాయాదుల చర్చ - పంజాబ్​

కర్తార్​పుర్ నడవా నిర్మాణంపై భారత్-పాక్​లు ద్వైపాక్షిక చర్చలకు పూనుకున్నాయి. నడవా సాకారమైతే ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాల్ని ఎలాంటి వీసా లేకుండానే దర్శించుకోగలుగుతారు.

కర్తార్​పూర్ 'నడవా'పై దాయాదుల చర్చలు
author img

By

Published : Mar 14, 2019, 3:31 PM IST

కర్తార్​పూర్ 'నడవా'పై దాయాదుల చర్చలు

భారత్​-పాక్ మధ్య ప్రతిపాదిత కర్తార్​పుర్​ నడవా నిర్మాణ విషయమై ఇరుదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమయ్యాయి. ఇరుదేశాల మధ్య ఉన్న సిక్కు పవిత్ర క్షేత్రాలను కలిపే కర్తార్​పూర్​ నడవాను తెరవాలని గత సంవత్సరం భారత్​-పాక్ ఓ అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఇవాళ భారత్​లో వాఘా సరిహద్దు వద్ద దాయాది దేశాల రాయబారులు సమావేశమయ్యారు.

పాక్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ముహమ్మద్​​ ఫైజల్ ఆధ్వర్యంలో పాక్ బృందం, భారత్​ అధికారులతో చర్చలు జరిపింది. మైనారిటీల సంక్షేమానికి పాక్​ ప్రాధాన్యంమిస్తోందని ఫైజల్ తెలిపారు. తదుపరి చర్చలు మార్చి 28న పాకిస్థాన్​ ఇస్లామాబాద్​లో జరుగనున్నాయి.

పంజాబ్​ సరిహద్దు వెంబడి నిర్మిస్తోన్న ఈ నడవా (4.7 కిలోమీటర్లు) ఇరుదేశాలలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతుంది. సిక్కు గురువు గురునానక్​ దేవ్​ 550 జయంతి (2019 నవంబర్​) లోగా ఈ నడవా పూర్తి చేయాలని దాయాది దేశాలు భావిస్తున్నాయి.

భారత్​ పంజాబ్​లోని సిక్కు పవిత్ర క్షేత్రం 'డేరా బాబా నానక్​ సాహెబ్'​, అలాగే పాకిస్థాన్​ పంజాబ్​లోని 'గురుద్వారా దర్బార్​ సాహిబ్​ కర్తార్​పుర్​' లను ఈ నడవా కలుపుతుంది. ఫలితంగా ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలను వీసా లేకుండా దర్శించడానికి మార్గం సుగమమవుతుంది.

శ్రమ తగ్గుతుంది...

ప్రస్తుతం భారత సిక్కులు బస్సులో లాహోర్ చేరుకుని అక్కడ నుంచి కర్తార్​పుర్​లోని పవిత్ర సిక్కు క్షేత్రానికి చేరుకుంటున్నారు. అంటే సుమారు 125 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. నిజానికి కేవలం 4.7 కిలోమీటర్ల దూరంలోని ఆ పవిత్ర దేవాలయాన్ని భారత దేశం నుంచి బైనాక్యులర్ ఉపయోగించి చూడవచ్చు. నడవా పూర్తయితే ఈ సమస్య తీరి ఇరుదేశాల భక్తులు పరస్పరం తమ పవిత్ర దేవాలయాలను సులభంగా దర్శించుకోవచ్చు.

పుల్వామా ఉగ్ర ఘటన నేపథ్యంలో ఈ కర్తార్​పుర్​ నడవా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.