బంగ్లాదేశ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 26మంది దుర్మరణం పాలయ్యారు. పద్మ నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవను.. ఇసుక రవాణా చేస్తున్న ఓడ ఢీకొట్టగా ఈ పెను విషాదం సంభవించింది.
బంగ్లా బజార్‌లోని ఫెర్రీ ఘాట్ వద్ద పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న పడవను అనుభవం లేని వ్యక్తి నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇసుకతో నిండిన ఓడ బలంగా ఢీకొట్టగా.. పడవ బోల్తా పడినట్లు తెలిపారు.
"ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశాం. మరో ఐదుగురిని ప్రాణాలతో కాపాడాం. అయితే చాలా మంది ప్రయాణికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి"
- పోలీసు అధికారి
"స్పీడ్ బోట్‌ను నడిపిస్తున్నది బాలుడే అనే సమాచారం అందింది. అనుభవం లేని డ్రైవర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి."
-ఆశికుర్ రెహ్మాన్, పోలీసు అధికారి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.