ETV Bharat / international

US Drone Attack: 'అమెరికా డ్రోన్​ దాడుల్లో 10 మంది అఫ్గానీలు మృతి'

ఉగ్రకుట్రను భగ్నం చేసేందుకు అమెరికా జరిపిన దాడి(US Drone Attack) కొంతమంది అఫ్గాన్​ పౌరులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అమెరికా జరిపిన దాడుల కారణంగా పది మంది మరణించారని టోలో న్యూస్​ తెలిపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పింది.

US Drone Attack
అమెరికా డ్రోన్​ దాడి
author img

By

Published : Aug 30, 2021, 1:58 PM IST

కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద(Kabul Airport) ఐసిస్​-కె పన్నిన కుట్రను అమెరికా ఆదివారం భగ్నం చేసింది. ముష్కరుల వాహనంపై డ్రోన్​ దాడి జరిపింది. అయితే.. ఈ దాడిలో చిన్నారులు సహా 10 మంది మృతి చెందారని స్థానికులు చెప్పినట్లుగా అఫ్గాన్​ వార్తా సంస్థ టోలో న్యూస్​ తెలిపింది.

కాబుల్‌ విమానాశ్రయం వద్ద గత గురువారం నరమేధానికి పాల్పడ్డ ఐఎస్‌ఐఎస్‌-కె ఉగ్ర సంస్థ ఆదివారం మరోసారి అలాంటి దాడికి వ్యూహరచన చేసిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ ఆదివారం తెలిపారు. ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని తాము గుర్తించామన్నారు. డ్రోన్‌ దాడి ద్వారా వారిని హతమార్చామని చెప్పారు. డ్రోన్‌ దాడి అనంతరం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని.. వాహనం నిండా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తద్వారా స్పష్టమవుతోందని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.