ETV Bharat / international

భారత్​ వ్యూహం: దీవులతో చైనాకు దీటుగా..!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యాన్ని చాటేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు చెక్​ పెట్టేందుకు భారత్​ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. అండమాన్​, నికోబార్​,లక్ష దీవుల్లో భారీగా సైనికీకరణ, మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టి, డ్రాగన్​ దుష్ట పన్నాగాలను భగ్నం చేయాలని నిర్ణయించింది. తనకు పెరటి భాగమైన ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం తరహాలో వివాదాలు, ఘర్షణలు జరిగే పరిస్థితిని నివారించేందుకు భారత్​ నడుం బిగించింది.

ASIAN COUNTRIES ALONG WITH INDIA AGAINST CHINA
దీవులతో చైనా వ్వూహాలకు చెక్​ పెట్టేందుకు సిద్ధమైన భారత్​
author img

By

Published : Aug 26, 2020, 10:18 AM IST

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యాన్ని చాటేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. అండమాన్, నికోబార్, లక్ష దీవుల్లో భారీగా సైనికీకరణ, మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టి, డ్రాగన్‌ దుష్ట పన్నాగాలను భగ్నం చేయాలని నిర్ణయించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మయన్మార్, పాకిస్థాన్, ఇరాన్‌లో అనేక రేవుల నిర్మాణం ద్వారా ఇక్కడ పట్టు సాధించాలని చైనా నౌకాదళం ప్రయత్నిస్తోంది. తనకు ‘పెరటి భాగమైన’ ఈ ప్రాంతంలో దక్షిణ చైనా సముద్రం తరహాలో వివాదాలు, ఘర్షణలు జరిగే పరిస్థితిని నివారించేందుకు భారత్‌ నడుం బిగించింది. దీవుల్లో మౌలిక వసతులను భారీగా ఆధునికీకరించాలని నిర్ణయించింది. తద్వారా తన నౌకాయానానికి ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటోంది. భారత సైనిక ఉన్నతాధికారుల కథనం ప్రకారం.. ఉత్తర అండమాన్స్‌లోని ఐఎన్‌ఎస్‌ కోహస్సా వైమానిక కేంద్రాన్ని, నికోబార్‌లోని క్యాంప్‌బెల్‌ స్ట్రిప్‌ను పూర్తిస్థాయిలో యుద్ధవిమాన స్థావరాలుగా మలుస్తారు. లక్షద్వీప్‌లోని అగట్టి వైమానిక కేంద్రాన్ని కూడా సైనిక కార్యకలాపాల కోసం ఆధునికీకరిస్తారు. తద్వారా మలాకా జలసంధి వరకూ విస్తరించిన బంగాళా ఖాతాన్ని, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ వరకూ ఉన్న అరేబియా సముద్రంపై తన పట్టును భారత్‌ నిలుపుకొంటుంది. ‘‘ఈ రెండు దీవుల్లోని ప్రాంతాలు భారత్‌కు కొత్త విమానవాహక నౌకలుగా ఉపయోగపడతాయి. నౌకాదళ పాదముద్రను విస్తరిస్తాయి. ఈ రెండు దీవులు.. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న సముద్రమార్గంలో ఉన్నాయి. ప్రపంచ సరకు రవాణాలో సగం మేర ఈ మార్గం గుండానే వెళుతోంది’’ అని సైనిక ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

ASIAN COUNTRIES ALONG WITH INDIA AGAINST CHINA
థాయ్​ కాలువ

థాయ్‌ కాలువకూ విరుగుడుగా..

చైనా.. థాయ్‌ కాలువ (క్రా కాలువ)పై ముందడుగు వేస్తున్న నేపథ్యంలో తాజా మౌలికవసతులను వేగంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం భారత్‌కు ఏర్పడింది. ఈ కాలువ ప్రతిపాదన 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. మలయ్‌ ద్వీపకల్పాన్ని తవ్వి, గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ను అండమాన్‌ సముద్రంతో అనుసంధానించాలన్నది ప్రణాళిక. దీనివల్ల.. హిందూ మహసముద్రానికి, పసిఫిక్‌ మహా సాగరానికి మధ్య ఉన్న ప్రధాన నౌకామార్గం మలాకా జలసంధిని విస్మరించడానికి వీలవుతుంది. రెండు మహాసాగరాల మధ్య ప్రయాణం చేసే నౌకలకు కనీసం 1200 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. క్రా కాలువపై భారత భద్రతా యంత్రాంగంలో ఏకాభిప్రాయం లేదు. 'బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌' (బీఆర్‌ఐ)లో భాగంగా చైనా చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల దీర్ఘకాలంలో భారత సముద్ర భద్రతకు ముప్పు పొంచి తలెత్తుతుందని ఒక అభిప్రాయం ఉంది. అయితే బ్యాంకాక్‌లో శక్తిమంతమైన వ్యక్తులపై చైనా ధన వర్షం కురిపిస్తోందని, ఈ నేపథ్యంలో థాయ్‌ కాలువ నిర్మాణం తప్పకుండా జరుగుతుందన్న భావన నెలకొంది. చైనాకు బద్ధ వ్యతిరేకులైన థాయ్‌ రాజకీయ నాయకులు కూడా ఈ కాలువకు మద్దతుగా నిలవడం గమనార్హం. థాయ్‌ రాజు మాత్రం ఈ కాలువను వ్యతిరేకిస్తున్నారు. అయితే మలాకా లేదా క్రా కాలువ గుండా వెళ్లే నౌకలకు తన రేవుల్లో ఆశ్రయం ఇవ్వడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చని భారత్‌లో కొందరు వ్యూహకర్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో వెళ్లే నౌకలు తమ వంతు వచ్చే వరకూ శ్రీలంక రేవుల్లో నిరీక్షిస్తున్నాయి. దీనివల్ల ఆ దేశానికి బోలెడు సొమ్ము సమకూరుతోంది.

సాగర పోరుకు సై..

దీవుల్లో మౌలిక వసతులను పెంచడం వల్ల భారత్‌ తన ఆర్థిక వృద్ధిని మరింత మెరుగుపరుచకోవడంతోపాటు హిందూ మహాసముద్రంలో తన సైనిక ఉనికిని పెంచుకోవడానికీ వీలవుతుంది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మలాకా జలసంధి వరకూ భారత నౌకాదళం అప్రమత్తంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దాడులకు దిగితే సైనిక చర్య కోసం సిద్ధంగా ఉండాలని భారత నౌకా దళానికి ఆదేశాలు జారీ అయ్యాయి. చైనాపై ఒత్తిడి పెట్టేందుకు అమెరికా ఇప్పటికే మూడు బి-2 స్టెల్త్‌ బాంబర్‌ యుద్ధవిమానాలను దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని డీగో గార్షియా దీవిలో మోహరించింది. విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ను దక్షిణ చైనా సముద్రంలోకి పంపింది. చైనాకు కడుపుమంట కలిగించేలా తైవాన్‌కు 66 ఎఫ్‌-16 యుద్ధవిమానాలను విక్రయించేందుకు కూడా సమ్మతించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.