కరోనా ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 64 లక్షల 8వేలు దాటింది. కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 11 లక్షల 23 వేలకు చేరువైంది.
అమెరికాలో ఇటీవలే రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించినా.. తాజాగా మళ్లీ పెరిగింది. కొత్తగా 57 వేల 327 కేసులు నమోదవగా.. 442మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 84 లక్షల 56 వేలు దాటింది.
అర్జెంటీనాలో 10లక్షలు...
అర్జెంటీనాలో కొత్తగా నమోదైన 12,214 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. దీంతో పది లక్షల కేసులు దాటిన ఆరో దేశంగా అర్జెంటీనా నిలిచింది. తాజాగా మరో 449 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో తాజాగా 18,804 మందికి కరోనా సోకింది. 80 మంది మరణించారు.
- బ్రెజిల్లో ఒక్కరోజే 15,783 కేసులు వెలుగుచూశాయి. మరో 321 మంది చనిపోయారు.
- రష్యాలో తాజాగా 15,982 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 179 మృతిచెందారు.
- కరోనా కేసుల్లో ఐదో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో ఒక్కరోజే 12,214 కేసులు నమోదవగా.. 73మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 13,243 మంది కొవిడ్ బాధితులుగా మారగా.. 146మంది మృతిచెందారు.
- ఇటలీలో తాజాగా 9,338 మందికి పాజిటివ్ తేలగా.. 73 మంది మరణించారు.
- ఇరాన్లో కొవిడ్ మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 337మంది కొవిడ్ ధాటికి బలయ్యారు. మరో 4,251 కేసులు నమోదయ్యాయి.
- దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి డాక్టర్ జ్వేలి మైఖ్జీకి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
- స్విట్జర్లాండ్ సైన్యాధ్యక్షుడు థామస్ సుస్లీ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి: ఫౌచీ మాటలు విని ప్రజలు విసిగిపోయారు: ట్రంప్