అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో పనిచేసేందుకు వ్యోమగాములతో కూడిన రాకెట్‌ను రష్యా విజయవంతంగా ప్రయోగించింది. ఈమేరకు కజకిస్థాన్‌లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్ష నౌకలో ముగ్గురు వ్యోమగాములను పంపినట్లు రష్యా పేర్కొంది.
వారిలో ఇద్దరు రష్యా వ్యోమగాములతో పాటు ఒకరు నాసా వ్యోమగామి ఉన్నట్లు తెలిపింది. బయోలజీ, బయోటెక్నాలజీ, భౌతిక శాస్త్రం, ఎర్త్ సైన్సెస్‌లలో వారు పరిశోధనలు చేయనున్నారు.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: నాలుగో దశకు సర్వం సిద్ధం