Alexei Navalny sentenced: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మోసం, కోర్టు ధిక్కరణ అభియోగాలకు సంబంధించిన కేసుల్లో దోషిగా తేలారు. ఆయనకు తొమ్మిదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు ఒకటి మంగళవారం తీర్పు వెలువరించింది. దాదాపు రూ.8.75 లక్షల జరిమానా చెల్లించాలని కూడా అందులో పేర్కొంది.
తాజా తీర్పుపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు ఆయనకు ఉంటుంది. 45 ఏళ్ల నావల్నీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాజకీయాల్లో బద్ధ శత్రువు. ఆయన్ను దీర్ఘకాలంపాటు జైలుకు పరిమితం చేసేందుకుగాను దురుద్దేశపూర్వకంగా తప్పుడు అభియోగాలు మోపినట్లు పుతిన్ సర్కారుపై విమర్శలున్నాయి.
నావల్నీ 2021 జనవరిలో అరెస్టయ్యారు. ఓ పాత కేసులో పెరోల్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇప్పటికే రెండున్నరేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
ఇదీ చూడండి:
'ఉక్రెయిన్‌లో శాంతి కోసం కలిసి పనిచేద్దాం'.. మోదీతో బోరిస్ జాన్సన్