ETV Bharat / international

'కశ్మీర్​పై భారత్ చర్యలను అడ్డుకుంటాం'

author img

By

Published : Jun 20, 2021, 7:49 AM IST

జమ్ముకశ్మీర్​ విభజన, భౌగోళిక రూపురేఖలను మార్చేందుకు భారత్​ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగా భారత్​ చర్యలు చేపట్టిన వేళ ఈ వ్యాఖ్యలు చేశారు.

QURESHI
'కశ్మీర్​పై భారత్ చర్యలను అడ్డుకుంటాం'

జమ్ముకశ్మీర్​లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. కశ్మీర్​ విభజన, భౌగోళిక రూపురేఖల మార్పు దిశగా భారత్​ ఎలాంటి చర్యలు చేపట్టినా వ్యతిరేకిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​లో ఇంకా ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు.

జమ్ముకశ్మీర్​కు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న సమావేశం కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మాట్లాడిన ఖురేషీ.. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దును పాక్​ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.