ETV Bharat / international

ఆ దేశాల్లో కంపించిన భూమి- రిక్టర్​ స్కేలుపై 6 తీవ్రత - భూకంపాల వార్తలు

అమెరికా, ఇండోనేసియాల్లో భూకంపాలు(Earthquake) సంభవించాయి. రెండు దేశాల్లోనూ 6కుపైగా తీవ్రత నమోదుకావడం గమనార్హం. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

central indonesia quake, ఇండోనేసియాలో భూకంపం
ఆ దేశాల్లో భారీ భూకంపాలు
author img

By

Published : Jul 10, 2021, 9:13 AM IST

సెంట్రల్​ ఇండోనేసియాలోని నార్త్​ సులవేసీ ప్రావిన్స్​లో శనివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్​ సేలుపై 6.2 తీవ్రత నమోదైంది. ఉదయం 7.43 గంటలకు భూమి కపించిందని.. కెపులౌన్​ తలౌడ్​ జిల్లా మెలోగ్వేన్​ పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు.

అయితే భూకంపం కారణంగా సునామీ ఏర్పడే సూచనలు లేవని స్పష్టం చేశారు.

ఆగని ప్రకంపనలు..

మరోవైపు అమెరికాలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. కాలిఫోర్నియా, నెవడా రాష్ట్రాల సరిహద్దు వద్ద 6.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

5.9 తీవ్రతతో భూకంపం ఏర్పడిన కొన్ని గంటలకే వరుసగా ప్రకంపనలు రావడం స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో 1994 తర్వాత ఇదే పెద్ద భూకంపం అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 4 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయని తెలిపారు.

ఇదీ చూడండి : సముద్రంలో ఎగిసిపడిన మంటలు.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.