ETV Bharat / international

మా పాలన ఇలా ఉంటుంది... తాలిబన్ల కీలక ప్రకటన - ఇస్లామిక్‌ చట్టాలు అంటే ఏమిటి?

అఫ్గానిస్థాన్​ను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు(Afghan Taliban) ఇస్లామిక్ ఎమిరేట్​ పేరుతో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తాము చేపట్టబోయే పరిపాలనా విధానంపై కీలక ప్రకటన చేశారు.

Taliban Govt Policy
Taliban Govt Policy
author img

By

Published : Sep 8, 2021, 12:54 PM IST

అఫ్గానిస్థాన్‌ను షరియా చట్టానికి(sharia rules) అనుగుణంగా పరిపాలిస్తామని తాలిబన్లు తేల్చి చెప్పారు. మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని(Afghanistan Interim Government) ఏర్పాటు చేసిన వారు పరిపాలనా విధానంపై కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తాలిబన్‌ సుప్రీం లీడర్‌(Taliban Supreme Leader) మౌల్వీ హిబైతుల్లా అఖుంద్‌జాదా పేరుతో వెలువడింది.

"ఎవరూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దు. అన్ని సమస్యలను సరైన మార్గంలో పరిష్కరిస్తాం. గత 20 ఏళ్లుగా రెండు లక్ష్యాలతోనే మేము పనిచేశాం. అఫ్గాన్‌ గడ్డపై నుంచి విదేశీ సేనలను పంపించి వేయడం ఒకటి కాగా.. దేశంలో పూర్తి స్థాయి సుస్థిర ఇస్లామిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెండోది. దీని ఆధారంగా భవిష్యత్తులో దేశ పాలన, అఫ్గాన్ల జీవితాలను ఇస్లామిక్‌ చట్టమైన షరియాను(Sharia Laws) అనుసరించి క్రమబద్ధీకరిస్తాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

"భవిష్యత్తులో అఫ్గాన్లు తాలిబన్లకు మద్దతు ఇచ్చి వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ప్రతిభావంతులైన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లకు ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ చాలా విలువనిస్తుంది. దేశానికి వారి మార్గదర్శకత్వం, సేవలు చాలా అవసరం. ప్రజలు దేశం విడిచి వెళ్లవద్దు(People Leaving Afghan). ఎవరితోనూ మాకు సమస్యలు లేవు" అని తాలిబన్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.