ETV Bharat / international

అఫ్గాన్​ అధ్యక్షుడిగా మరోసారి 'ఘనీ' ఎన్నిక - అఫ్గానిస్థాన్​ తాజా వార్తలు

అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడిగా మరోమారు విజయం సాధించారు అష్రఫ్​ ఘనీ. అయితే ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అనుమానం వ్యక్తం చేశారు. తాలిబన్లు కూడా ఘనీ విజయాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో జరగనున్న శాంతి చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి.

Afghan president wins vote, opponent says he's the winner
అఫ్గాన్​ ఎన్నికల్లో ఘనీ విజయం.. కానీ!
author img

By

Published : Feb 19, 2020, 9:42 AM IST

Updated : Mar 1, 2020, 7:43 PM IST

అఫ్గాన్​ అధ్యక్షుడిగా మరోసారి 'ఘనీ' ఎన్నిక

అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడిగా అష్రఫ్​ ఘనీ మరోమారు విజయం సాధించారు. గతేడాది సెప్టెంబరు 28న జరిగిన ఎన్నికల ఫలితాలను తాజాగా విడుదల చేసింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఎన్నికల్లో ఘనీ 50.64 శాతంతో మొత్తం 6,23,592 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి​ అభ్యర్థి అబ్దుల్లా 39.52శాతం ఓట్లు దక్కించుకున్నారు. విజయానంతరం మాట్లాడిన ఘనీ.. అఫ్గాన్​ ప్రజలను ఏకం చేసే సమయం ఆసన్నమైందని వెల్లడించారు.

శాంతి చర్చలపై ప్రభావం...!

అయితే ఎన్నికల సంఘం ప్రకటనను వ్యతిరేకించారు అబ్దుల్లా. తనను తానే విజేతగా ప్రకటించుకున్నారు. మరోవైపు తాలిబన్లు కూడా ఘనీ విజయాన్ని ఖండించారు. ఈ పూర్తి వ్యవహారం అమెరికా-తాలిబన్ల మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందం చర్చలపై పడే అవకాశముంది.

ఇదీ చూడండి:'యువత భవితను మోదీ-షా నాశనం చేశారు'

Last Updated : Mar 1, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.