అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు, ప్రభుత్వానికి మధ్య శాంతిచర్చల దిశగా అడుగులు పడుతున్నాయి. తిరుగుబాటుదారులు హింసను గణనీయంగా తగ్గిస్తే.. ఈ వారం నుంచి 5,000 మంది తాలిబాన్ ఖైదీలను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. తొలి విడతగా శనివారం 15 వందల మందిని విడుదల చేస్తామని, శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత మరో 3,500 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేస్తామని అఫ్గాన్ అధ్యక్షుడు అష్రప్ ఘనీ అధికార ప్రతినిధి సెడిక్ సెద్దిఖీ తెలిపారు.
దేశంలో దాడులను తగ్గించడంపై ఈ విడుదల ఆధారపడి ఉంటుందని తెలిపారు. మంగళవారం నుంచే శాంతి చర్చలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ఐదువేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేయాలంటూ తాలిబన్లు డిమాండ్ చేసినందున ఆలస్యమయ్యాయి.