అఫ్గానిస్థాన్ ఉత్తర కాబుల్‌లోని మసీదుపై శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్ పోలీసులు తెలిపారు. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు.
ఈ పేలుడులో ముస్లిం మతగురువు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు. మసీదులో ప్రార్థనలు ప్రారంభమయిన వెంటనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ బాంబు దాడికి తామే బాధ్యులం అంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదని చెప్పారు. కానీ, మతగురువు లక్ష్యంగానే ఈ బాంబు దాడి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఒప్పందం జరిగింది. అయినా ఈ పేలుడు సంభవించటం గమనార్హం.