ETV Bharat / international

అఫ్గాన్​- పాక్ బలగాల పరస్పరం కాల్పులు - అఫ్గాన్​- పాక్ బలగాలు పరస్పరం కాల్పులు

అఫ్గానిస్థాన్​లోని దక్షిణ కాందహార్ సరిహద్దులో అఫ్గాన్​- పాక్ బలగాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ దాడిలో ఒక అఫ్గాన్​ సైనికుడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత పాక్ బలగాలు వెనక్కి వెళ్లినట్లు కాందహార్​ ఆర్మీ అధికారి యహ్యా అలవీ తెలిపారు.

Afghan, Pak forces
అఫ్గాన్​- పాక్ బలగాలు
author img

By

Published : Apr 28, 2021, 6:39 AM IST

దక్షిణ కాందహార్​ స్పిన్​ బోల్దాక్​ ప్రాంతం లోక్​మాన్ గ్రామంలో అఫ్గాన్- పాక్ బలగాలు పరస్పరం కాల్పులకు పాల్పడ్డాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఈ ఘర్షణ ముగిసిందని.. కాందహార్​ ఆర్మీ అధికారి యహ్యా అలవీ తెలిపారు. కాల్పుల్లో ఒక అఫ్గాన్​ సైనికుడికి గాయాలైనట్లు వివరించారు. అనంతరం.. పాక్​ సైన్యం అక్కడినుంచి వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. ఎంతమంది పాక్ సిబ్బందికి గాయాలయ్యాయనేది తెలియాల్సి ఉందన్నారు. ఇరు దేశాల బలగాల మధ్య కాల్పులు జరగటం ఈ నెలలో ఇది రెండోసారని స్పష్టం చేశారు.

అయితే.. ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని అఫ్గానిస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

ఇదీ చదవండి : '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.