ETV Bharat / international

అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి-ముగ్గురు పౌరులు మృతి

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో మరోమారు ఆత్మాహుతి దాడి జరిగింది. నగర శివార్లలోని ప్రత్యేక దళాల శిబిరం వెలుపల చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడింది తాలిబన్లేనని అఫ్గాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

AFGHAN-ATTACK
అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి
author img

By

Published : Apr 29, 2020, 3:07 PM IST

అఫ్గానిస్థాన్​లో మరోసారి భద్రతా బలగాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించినట్లు ఆదేశాధికారులు వెల్లడించారు. అఫ్గాన్​ రాజధాని కాబూల్​లోని​ దక్షిణ శివార్లలో జరిగిన ఈ దాడిలో మరో 15 మందికి గాయాలయ్యాయి.

ఈ దాడి తాలిబన్లే చేసినట్లు అఫ్గాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాబూల్​లోని ప్రత్యేక దళ శిబిరాన్ని అమెరికా బలగాల కమాండర్ సందర్శించిన మరుసటి రోజే.. అదే శిబిరం వెలుపల ఈ దాడి జరిగిందని తెలిపింది.

అమాయకులు బలి..

శిబిరంలో పనిచేస్తున్న గుత్తేదారులు.. లోనికి వస్తుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ లోనికి రావడంలో విఫలమైన నేపథ్యంలో బయటే బాంబును పేల్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఫలితంగా అమాయకులైన ప్రజలు బలయ్యారని అఫ్గాన్​ హోంశాఖ ప్రతినిధి తారీఖ్ అరియాన్​ వెల్లడించారు.

ఈ దాడి తాలిబన్లదేనా..

ఈ దాడిపై ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. కానీ కాబూల్​ ప్రాంతంలో తాలిబన్లు, ఇస్లామిక్ స్టేట్​ ఆధిపత్యం కొనసాగుతోంది. తరచూ సైన్యం, పౌరులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నాయి ఈ సంస్థలు.

అఫ్గాన్​ నుంచి అమెరికా, నాటో దళాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన తర్వాత కూడా తాలిబన్లు వరుసగా భద్రత సిబ్బందిపై దాడులు చేస్తూనే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.