ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో ఆత్మాహుతి దాడులు- 34 మంది మృతి

author img

By

Published : Nov 29, 2020, 1:51 PM IST

Updated : Nov 29, 2020, 10:18 PM IST

suicide bombings
అఫ్గానిస్థాన్​లో ఆత్మాహుతి దాడులు

13:48 November 29

అఫ్గానిస్థాన్​లో ఆత్మాహుతి దాడులు- 34 మంది మృతి

అఫ్గానిస్థాన్​ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఆదివారం జరిగిన రెండు ఆత్మాహుతి బాంబు దాడుల్లో 34 మంది మృతిచెందారు.  

తూర్పు ఘజినీ రాష్ట్రంలోని సైనిక స్థావరంపై కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 31 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో ఘటనలో దక్షిణ ఆఫ్గాన్​.. జుబల్​లోని ప్రావిన్షియల్​ కౌన్సిల్ చీఫ్​ కాన్వాయ్​పై కారు బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించారని అధికారులు చెప్పారు. చిన్నారులు సహా మొత్తం 12 మంది గాయపడ్డారని తెలిపారు. స్వల్ప గాయాలతో ప్రావిన్షియల్​ చీఫ్​ బయటపడ్డారని వెల్లడించారు.

ఈ దాడులకు తామే బాధ్యులమని ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు.

ఇదీ చూడండి:కరోనా పుట్టింది భారత్​లోనే: చైనా

Last Updated : Nov 29, 2020, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.