ETV Bharat / international

తాలిబన్ల అధీనంలోకి మూడు రాష్ట్రాలు, ఆర్మీ స్థావరం - అఫ్గాన్​లో తాలిబన్ల హింస

అఫ్గానిస్థాన్​లోని మరో మూడు రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. దీంతో దేశంలోని ఈశాన్య ప్రాంతం పూర్తిగా వారి వశమైనట్లు సమాచారం. అలాగే.. కుందుజ్​ రాష్ట్ర​ రాజధానిలోని ఓ కీలక సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు ముష్కరులు.

Afghan, Taliban
అఫ్గానిస్థాన్​, తాలిబన్​
author img

By

Published : Aug 11, 2021, 4:08 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో దేశంలోని కీలక నగరాలు, ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ వశం చేసుకుంటున్నారు. తాజాగా కుందుజ్​ రాష్ట్రంలో కీలకమైన సైనిక స్థావరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అఫ్గాన్​ అధికాలు సైతం ధ్రువీకరించారు. దీంతో దేశంలోని ఈశాన్య ప్రాంతం మొత్తం వారి అధీనంలోకి వెళ్లినట్లయింది.

కుందుజ్​ నగరంలోని విమానాశ్రయం వద్ద ఉన్న 217 కార్ఫ్స్​ స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించినట్లు అధికారులు తెలిపారు. అఫ్గాన్​ జాతీయ సైన్యంలోని ఏడు కీలక కమాండ్లలో 217 కార్ఫ్స్​ కమాండ్​ ఒకటి. మరోవైపు.. ఆ ప్రాంతం నుంచి సైనికులు పారిపోతున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియోను ఆన్​లైన్​లో పోస్ట్​ చేశారు తాలిబన్లు.

ఈ అంశంపై అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

మూడు రాష్ట్రాలు..

అఫ్గాన్​ ఈశాన్య ప్రాంతంలోని మరో మూడు రాష్ట్రాలైన బదఖ్షన్​, బఘ్లాన్​, ఫరాహ్​ రాజధానులను తాలిబన్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలోని మూడింట రెండొంతుల భూభాగం వారి అధీనంలోకి వెళ్లినట్లు చెప్పారు. దీంతో కేంద్ర సర్కార్​పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బల్ఖ్​ రాష్ట్రానికి వెళ్లారు అధ్యక్షుడు అష్రాఫ్​ గని.

ఫరాహ్​ రాష్ట్ర రాజధానిలో తాలిబన్లు ఆయుధాలతో చక్కర్లు కొడుతూ.. ఓ భద్రతా సిబ్బందిని లాక్కెళుతున్న దృశ్యాలు కనిపించాయి. వారి చేతుల్లో ఎం-16 రైఫిల్స్​, ఇతర ఆయుధాలు ఉన్నాయి. అఫ్గాన్​ బలగాలకు అమెరికా అందించిన ఫోర్డ్​ పికప్​ ట్రక్కుల్లో వారు నగరం మొత్తం గాలిస్తున్నారు.

నిలువరించగలరా?

ప్రస్తుతానికి దేశ రాజధాని కాబుల్​కు ఎలాంటి ముప్పు లేదని అధికారులు చెబుతున్నారు. అయితే.. తాలిబన్లు వేగంగా దూసుకొస్తూ.. ఒక్కొక్క ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం ఎంత కాలం వారిని నిలువరించగలదనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు.. తాలిబన్ల ఏరివేతకు ప్రత్యేక ఆపరేషన్​ దళాలను విస్తరిస్తోంది ప్రభుత్వం. తాలిబన్లు, బలగాల మధ్య తలెత్తుతున్న ఘర్షణల్లో వేలాది మంది పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అమెరికా బలగాలు అడపాదడపా క్షిపణి దాడులు చేపడుతున్నా.. దాదాపుగా ఆపరేషన్లకు దూరంగా ఉంటున్నట్లే కనిపిస్తోంది.

ఆరు రాష్ట్రాలు..

తాలిబన్లు గత వారం రోజుల్లోనే ఆరు రాష్ట్రాల రాజధానులను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందులో దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కుందుజ్​ రాష్ట్ర రాజధాని కుందుజ్​ నగరం ఉంది.

ఇదీ చూడండి: రెచ్చిపోతున్న తాలిబన్లు- ప్రాణభయంతో అఫ్గాన్​ మహిళలు!

'ఈ గందరగోళం నుంచి నా దేశాన్ని కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.