అఫ్గానిస్థాన్లో వాయుసేన జరిపిన దాడుల్లో 33 మంది తాలిబన్లు హతమయ్యారు. బాల్ఖా రాష్ట్రంలోని కాల్దర్, షార్టిప జిల్లాలో తాలిబన్లు సమావేశాలు నిర్వహించారు. ముందస్తు సమాచారం అందుకున్న సైన్యం వారిపై దాడి జరిపింది. మరో 19 మంది గాయపడ్డట్లు.. ఆ దేశ మిలిటరీ ఉత్తర విభాగ అధికార ప్రతినిధి మహమ్మద్ హనీఫ్ రిజై తెలిపారు. దాడుల్లో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.
మే 1న అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు మరింత రెచ్చిపోయారు. భూబాగాలను ఆక్రమించారు.