ETV Bharat / international

రోగులకు మందుల్లేవు.. వైద్యులకు జీతాలు రావు.. తాలిబన్లతో ఎన్ని కష్టాలో... - తాలిబన్ల పాలన

తాలిబన్ల పాలనలో అఫ్గాన్​ ఆర్థికంగా విలవిలలాడుతోంది(taliban afghan). అక్కడి వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. ఇది వారి జీవితంపై దుష్ప్రభావం చూపుతోంది. అటు ఆసుపత్రుల్లో పరికరాలు, మందుల కొరతతో ప్రజలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని అఫ్గాన్​వాసులు వేడుకుంటున్నారు.

afghans
అఫ్గానిస్థాన్​
author img

By

Published : Sep 17, 2021, 6:43 PM IST

Updated : Sep 17, 2021, 9:58 PM IST

రోగులకు మందుల్లేవు.. వైద్యులకు జీతాలు రావు.. తాలిబన్లతో ఎన్ని కష్టాలో...

అఫ్గానిస్థాన్​లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది(afghan crisis 2021). తాలిబన్ల ఆక్రమణతో అంతర్జాతీయ సమాజం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడి.. అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్య నిపుణులు.. జీతాలు అందక దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. వైద్య పరికరాలు, మందుల కొరత కారణంగా రోగులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

రోగుల ఆర్తనాథాలను వైద్యులు తట్టుకోలేకపోతున్నారు(afghan hospital kabul). తమను అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని.. తక్షణమే సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

Afghan doctors
అఫ్గాన్​ వైద్యులు

ప్రభుత్వ ఉద్యోగులది కూడా ఇదే దుస్థితి. అనేక ప్రభుత్వ కార్యాలయాలు నెల రోజులుగా మూతపడే ఉన్నాయి. అందువల్ల ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. తిరిగి ఉద్యోగాల్లో చేరాలని తాలిబన్లు పిలుపునిచ్చినా, వేతనాలు, తాలిబన్ల పాలనపై అందరిలో ఆందోళన నెలకొంది.

"మాకు జీతాలు ఇవ్వడం లేదు. ఇది మా మీద చాలా ప్రభావం చూపుతోంది. రెండు నెలలుగా మాకు జీతాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులపై చాలా భారం పడుతోంది. అఫ్గానిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ, మా వేతనాలు అన్నీ అంతర్జాతీయ నిధులపైనే ఆధారపడి ఉంటాయి. దురదృష్టవశాత్తు అమెరికా నిధులను ఆపేసింది. చాలా కష్టంగా ఉంటోంది."

--- నూరుల్లాన్​ హజ్రాటీ, ప్రభుత్వ ఉద్యోగి.

తాలిబన్లు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, విధివిధానాలను ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వాన్ని నడిపేందుకు అసలు తాలిబన్ల వద్ద ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉద్యోగుల గుండెల్లో అలజడులు సృష్టిస్తోంది.

Afghan
కాబుల్​ వీధుల్లో ప్రజలు

అటు కాబుల్​లోని(kabul news latest)​ ఏటీఎంల వద్ద రద్దీ ఇంకా కొనసాగుతోంది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోడానికి ప్రజలు రోజూ బారులు తీరుతున్నారు. కానీ వారికి ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఇన్నేళ్లు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

"ఈ కాలంలో అఫ్గాన్​లో బతకడం చాలా కష్టంగా ఉంటోంది. ఇది మా డబ్బు. మా డబ్బును వాళ్లు తీసుకున్నారు. ఆ డబ్బును తిరిగివ్వడానికి వారు ఇష్టపడటం లేదు."

-- స్థానికుడు.

అఫ్గాన్​లో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వాలే కారణమని మండిపడితున్నారు తాలిబన్లు(taliban latest news). దేశ ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, వారు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారని ఆరోపిస్తున్నారు.

taliban
తాలిబన్లు

అమెరికా దళాలు వైదొలగకముందే.. ఆగస్టు 15న కాబుల్​పై జెండా ఎగరేశారు తాలిబన్లు. ఫలితంగా ఆ దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశాన్ని వీడేందుకు ప్రజలు పోటీపడి కాబుల్​ విమానాశ్రయం వద్ద బారులుతీరారు. పలువురు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోగా.. అనేకమంది అక్కడే ఉండిపోయారు. కొన్ని రోజుల అనంతరం దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 17, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.