ETV Bharat / international

అఫ్గాన్​ హిమపాతానికి 12 మంది బలి

Afghan Avalanche: భారీ హిమపాతం కారణంగా అఫ్గాన్​ ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో 12 మంది మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

Afghanistan Avalanche
హిమపాతం
author img

By

Published : Feb 8, 2022, 6:21 AM IST

Afghan Avalanche: అఫ్గానిస్థాన్‌ ఈశాన్య ప్రాంతంలోని సరిహద్దుల్లో భారీ హిమపాతం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి ఆచూకి తెలియట్లేదని అధికారులు తెలిపారు. హిమపాతం సంభవించిన అనంతరం కొండచరియలు కూడా విరిగిపడ్డాయని వెల్లడించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు సహాయం చేయడానికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున మారుమూల ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపినట్లు జిల్లా యంత్రాంగం కూడా తెలిపింది.

ఆగస్టులో తాలిబన్‌లు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత పాకిస్థాన్ ఆఫ్గాన్​తో సరిహద్దును మూసివేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో 2,670 కి.మీ మేర పాకిస్థాన్ కంచె వేసింది.

ఇదీ చదవండి: దూసుకొచ్చిన కారు.. మహిళా కానిస్టేబుల్​ సాహసంతో విద్యార్థిని సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.