ETV Bharat / international

బూస్టర్ డోస్ వేసుకున్నవాళ్లకే ఆ దేశంలోకి ఎంట్రీ - Cause of new covid cases in China

Covid Booster dose mandatory: ఒమిక్రాన్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలు.. వాటిని మరింత కఠినతరం చేస్తున్నాయి. బూస్టర్​ డోసు వేసుకున్నవాళ్లకే తమ దేశంలోకి అనుమతి లభిస్తుందని యూఏఈ తెలిపింది. జపాన్​లో మరో మూడువారాలు ఆంక్షలు పొడిగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

booster dose
booster dose
author img

By

Published : Jan 18, 2022, 7:36 PM IST

Covid Booster dose mandatory: ఒమిక్రాన్​ విస్తరిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణికులు, పర్యటకులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్(యూఏఈ) కూడా ఈ జాబితాలో చేరింది.

యూఏఈ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే.. బూస్టర్ డోసు తప్పనిసరి చేసింది అక్కడి అధికార యంత్రాంగం. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్​ డోసు అందుకుంటేనే వ్యాక్సినేషన్​ పూర్తయినట్లు పరిగణించనున్నట్లు వెల్లడించింది. అబుదాబిలో ప్రవేశించేవారు తప్పనిసరిగా వారి టీకా స్థితిని తెలియజేసే.. గ్రీన్ పాస్​ను చూపించాలి.

విదేశీ పార్శిల్స్​ వల్లే కొత్త కేసులు

విదేశాల నుంచి వస్తున్న పార్శిల్స్​ వల్లే తమ దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయని చైనా అధికారిక మీడియా పేర్కొంది. విదేశాల నుంచి వస్తున్న పార్శిల్స్​కు పెరుగుతున్న కొత్త కేసులకు సంబంధముందని చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రంలోని వైరాలజిస్టులు తెలిపినట్లు వివరించింది.

Covid deaths in Australia

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​వేల్స్​​, విక్టోరియా, క్వీన్స్​లాండ్​ రాష్ట్రాల్లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మంగళవారం ఒక్కరోజే 74 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ కేసులు భారీగా పెరగడం సహా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వైరస్​ బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

Corona restrictions in Japan

ఒమిక్రాన్ వేరియంట్​తో కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధించిన ఆంక్షలను మరింత కాలం పొడిగించాలని యోచిస్తోంది జపాన్​ సర్కారు. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుని.. శుక్రవారం నుంచి అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే జరిగితే.. ఒకినావా, యమగుచి, హిరోషిమాతో సహా 16 ప్రాంతాల్లో మరో మూడువారాలు పాటు కొవిడ్​ ఆంక్షలు కొనసాగుతాయి.

Sputnik vaccine efficacy omicron

ఒమిక్రాన్​పై స్పుత్నిక్​-వి టీకా 75 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని రష్యాలోని గమలేయా పరిశోధన కేంద్రం అధిపతి అలెగ్జాండర్​ గింట్స్​బర్గ్​ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆరు నెలల్లో స్పుత్నిక్ లైట్ బూస్టర్ డోసును తీసుకుంటే.. ఒమిక్రాన్ నుంచి 100 శాతం రక్షణ పొందవచ్చని వెల్లడించారు. అయితే రీవ్యాక్సినేషన్​ చేయకపోతే ఆ సామర్థ్యం 56-57 శాతానికి తగ్గుతుందని గింట్స్​బర్గ్​ తెలిపారు. ఒమిక్రాన్‌ సోకితే స్పుత్నిక్​-వి ప్రభావం ఎనిమిది రెట్లు తగ్గుతుందని.. అయినప్పటికీ ఒమిక్రాన్​ నుంచి రక్షణ పొందవచ్చన్నారు.

ఒమిక్రాన్​పై పాక్షికంగానే నాలుగో టీకా డోసు ప్రభావం

కొవిడ్​ టీకా నాలుగో డోసుతో యాంటీబాడీలు పెరుగుతాయని.. కానీ ఒమిక్రాన్​ వేరియంట్ నుంచి పాక్షిక రక్షణను మాత్రమే లభిస్తుందని ఇజ్రాయెల్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. వివిధ టీకాల కాంబినేషన్​లో టీకాల సమర్థత, భద్రతను పరీక్షించి.. యాంటీబాడీల పెరుగుదల రేటును విశ్లేషించగా.. ఈ విషయం తెలిసింది.

'వైరస్​ సోకిన జంతువుల చంపేస్తాం'

హాంకాంగ్​లో కొవిడ్ సోకిన వ్యక్తి పని చేసిన ఓ పెంపుడు జంతువుల దుకాణంలో ఎలుకలు సహా 2,000 జంతువులకు వైరస్​ పాజిటివ్​గా తేలింది. దీంతో వాటిని చంపేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు నగరం చిట్టెలుక విక్రయాలు, చిన్న క్షీరదాల దిగుమతిని కూడా నిలిపివేశారు.

ఇదీ చూడండి: రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో 'నో'- ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.