ETV Bharat / international

కరోనా వైరస్​ అంతరిక్షం నుంచి వచ్చిందట! - తాజా వార్తలు కరోనా

అంతరిక్ష శిల లేదా ఉల్క ద్వారా కరోనా మహమ్మారి భూమిని చేరి ఉంటుందని కొంత మంది శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. వైరస్​ను చైనాలోని వుహాన్​ ల్యాబ్​లో తయారు చేసినట్లు మరికొందరు వాదిస్తున్న తరుణంలో తాజా అధ్యయనం పెద్ద చర్చకు దారితీసింది.

A theory states that Corona virus may have come from space.
'కరోనా అంతరిక్షం నుంచి వుహాన్​కు వచ్చింది'
author img

By

Published : Oct 12, 2020, 7:30 AM IST

Updated : Oct 12, 2020, 9:12 AM IST

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కీలకంగా మారింది. ఇది చైనాలోని వుహాన్​లో పుట్టుకొచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నా.. అది అంతరిక్షం నుంచి వచ్చి ఉండొచ్చని ఓ సిద్ధాంతం పేర్కొంటోంది. అంతరిక్ష శిల లేదా ఉల్క ద్వారా భూమిని చేరి ఉంటుందని సూత్రీకరిస్తోంది.

కరోనా వైరస్​ మూలాలను కనుగొనేందుకు పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వుహాన్​లో జీవ పరిశోధనశాలలో దీన్ని అభివద్ధి చేశారని కొందరు చెబుతుండగా.. మరికొందరేమో అది గబ్బిలాల ద్వారా వచ్చిందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడ్వర్డ్​ జె స్టీల్, ఎన్​ చంద్ర విక్రమసింఘే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక వినూత్న సిద్ధాంతాన్ని తెచ్చింది. క్యాండిడా ఆరిస్​ కారణంగా తలెత్తిన ఫంగల్​ వ్యాధి, ప్రస్తుత కొవిడ్​-19 మహమ్మారిపై వీరు దృష్టి సారించారు.

"ఈ రెండు మహమ్మారులు.. తోక చుక్కలు లేదా ఉల్కల ధూళి రేణువుల ద్వారా అంతరిక్షం నుంచి వచ్చి ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్​ 11న ఈశాన్య చైనాపై పడిన ఉల్క వల్ల కరోనా వైరస్​ భూమిని చేరింది. నాడు అసాధారణ స్థాయిలో ప్రకాశవంతమైన అగ్నిగోళం కనిపించింది. వుహాన్​కు ఉత్తరాన 2 వేల కిలోమీటర్ల దూరంలో ప్రాంతాన్ని ఆ అగ్నిగోళం ఢీ కొట్టింది. అయితే ఆ ఉల్క శకలాల్లో చాలా వరకు భూ వాతావరణంలోనే నిక్షిప్తమయ్యాయి. ఫలితంగా నవంబర్​ చివరి నుంచి వుహాన్​ ప్రాంతంలో వైరల్​ నిమోనియాకు సంబంధించిన తొలి కేసులు నమోదయ్యాయి."

- శాస్త్రవేత్తలు

కరోనా వైరస్​ రోదసి నుంచి వచ్చిందన్న సిద్ధాంతం అసాధారణంగా ఉందని, అందులో వాస్తవికత లేదని ఖగోళ జీవశాస్త్రవేత్త గ్రాహం లావ్​ చెప్పారు.

Last Updated : Oct 12, 2020, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.