కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్వ్యాప్తంగా రెస్టారెంట్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు శానిటైజర్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో శానిటైజర్ల కొరత ఏర్పడింది. అయితే ఓ రెస్టారెంట్ యజమాని బీరు తయారీకి ఉపయోగించే ఆల్కహాల్‌తో శానిటైజర్లను తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాడు.
ఫిలిప్పీన్స్‌లోని రౌల్ మసాంగ్‌కే అనే వ్యక్తి తన రెస్టారెంట్లో బీరు తయారు చేసి అమ్మేవాడు. వైరస్ వేగంగా వ్యాపి చెందుతుండటం వల్ల ప్రజలు ఎవరూ బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో కస్టమర్లు లేక రెస్టారెంట్ వెలవెలబోతోంది.
ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని మసాంగ్కు వినూత్న ఆలోచన వచ్చింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు బీరు తయారీకి ఉపయోగించే ఆల్కహాల్‌తో శానిటైజర్లను తయారు చేయటం ప్రారంభించాడు. ఆ శానిటైజర్లను ముందుగా తన షాపుకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆస్పత్రుల్లో శానిటైజర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మసాంగ్.. తాను తయరు చేసిన శానిటైజర్లను ఉచితంగా అందిస్తున్నాడు.
దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శానిటైజర్లను తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందించటం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నాడు మాసాంగ్.
ఇదీ చూడండి:కరోనాపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమీక్ష