ETV Bharat / international

రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో 'నో'- ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం! - దక్షిణ కొరియా వార్తలు

Man set himself on fire: రెండో పెళ్లి కోసం సంబంధం చూసేందుకు ఓ మ్యారేజ్ బ్యూరో నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టాడు ఓ వృద్ధుడు. ఒంటిపై పెట్రోల్​ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. దక్షిణ కొరియాలోని జేజు ఐలాండ్​లో జరిగిందీ ఘటన.

Man set himself on fire:
రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో 'నో'- ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!
author img

By

Published : Jan 18, 2022, 4:13 PM IST

Man set himself on fire: మ్యారేజ్ బ్యూరో ప్రతినిధితో తీవ్ర స్థాయిలో గొడవపడిన ఓ వృద్ధుడు.. ఆత్మాహుతికి యత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని.. ఇప్పుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. దక్షిణ కొరియాలోని జేజు ఐలాండ్​లో జరిగిందీ ఘటన.

ఏం జరిగింది?

జనవరి 16న మధ్యాహ్నం ఒంటి గంటకు(స్థానిక కాలమానం ప్రకారం) 64 ఏళ్ల వృద్ధుడు ఓ మ్యారేజ్ బ్యూరోకు వచ్చాడు. విదేశీయులతో పెళ్లి సంబంధాలు కుదిర్చే ఆ సంస్థను తనకు సేవలు అందించాల్సిందిగా కోరాడు. తాను వివాహం చేసుకునేందుకు సత్వరమే ఓ అమ్మాయిని చూసిపెట్టాలని అడిగాడు. కానీ.. ఇక్కడే ఆ వృద్ధుడికి, మ్యారేజ్ బ్యూరో ప్రతినిధికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు.

కాసేపటి తర్వాత ఆ వృద్ధుడు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. తనతో తెచ్చుకున్న సీసా మూత తెరిచి.. అందులోని పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. జేబులోని లైటర్ తీసి వెలిగించి.. శరీరానికి నిప్పంటించుకున్నాడు. ఈ అనూహ్య పరిణామంతో మ్యారేజ్ బ్యూరో సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. నీళ్లు పోసి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ వృద్ధుడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు.

అసలు గొడవ ఎందుకు?

దక్షిణ కొరియాలోని ఓ చట్టమే వృద్ధుడికి, మ్యారేజ్ బ్యూరో ప్రతినిధికి మధ్య గొడవకు కారణమని తెలిసింది. ఆ చట్టం ప్రకారం.. దక్షిణ కొరియా వాసులు విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ విదేశీ వ్యక్తికి వివాహ వీసా తీసుకోవాలి. కానీ.. ఇలానే మరో విదేశీ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవాలంటే.. మొదటి వివాహం జరిగి కనీసం ఐదేళ్లు నిండాలి. ఇదే విషయంలో ఆ వృద్ధుడికి, మ్యారేజ్ బ్యూరోకు మధ్య గొడవైంది. ఇటీవలే ఓ విదేశీయురాలిని పెళ్లి చేసుకున్న వృద్ధుడికి.. రెండో పెళ్లి ఇప్పట్లో కుదరదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆ మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి. ఇది వాగ్వాదానికి, చివరకు ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది.

ఇదీ చదవండి: మహిళను పట్టాలపైకి తోసేసిన యువకుడు.. డ్రైవర్‌ షాక్‌లోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.