ETV Bharat / international

హెలికాప్టర్ కూలి 9 మంది మృతి

author img

By

Published : Mar 18, 2021, 10:33 AM IST

Updated : Mar 18, 2021, 12:08 PM IST

అఫ్గానిస్థాన్​లో స్పెషల్​ ఫోర్సెస్ హెలికాప్టర్​ కూలిన ఘటనలో 9 మంది మృతిచెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని అఫ్గాన్​ రక్షణ శాఖ పేర్కొంది. గురువారం కాబూల్​లో మరో బాంబు దాడి జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా చేసిన ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

9 people died in helicopter crash in Behsud district
అఫ్గాన్​లో హెలికాప్టర్ కూలి 9 మంది మృతి

అఫ్గానిస్థాన్ మైదాన్​ వర్దాగ్​ రాష్ట్రం బేహ్​సుద్​ జిల్లాలో ప్రత్యేక దళాల హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు.

బుధవారం రాత్రి ఎమ్​ఐ-17 హెలికాప్టర్ కూలినట్లు అఫ్గాన్​ రక్షణ శాఖ స్పష్టం చేసింది. మృతుల్లో ఐదుగురు అధికారులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది.

బస్సుపై దాడి-ముగ్గురు మృతి

కాబూల్​లో ఐటీ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తోన్న బస్సుపై జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతిచెందారు. 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సరీ కోటల్​ ప్రాంతంలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

సోమవారం కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తోన్న బస్సుపై దాడి జరిగిందని, ఆ ఘటనలో ఐదుగురు మృతిచెందారని స్థానిక మీడియా వెల్లడించింది.

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మే నెలతో ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగులపై దాడులు పెరుగుతున్నాయి. గత 18 రోజుల్లో జరిగిన దాడుల్లో 144 మంది మృతిచెందగా 214 మంది గాయాలపాలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది.

ఇదీ చదవండి:మానవ హక్కులపై అమెరికాను ఎండగట్టిన చైనా!

Last Updated : Mar 18, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.