ETV Bharat / international

లంకలో మళ్లీ పేలుడు- 87 డిటోనేటర్లు గుర్తింపు - శ్రీలంక

శ్రీలంక రాజధాని కొలొంబోలో తాజాగా మరో 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు అధికారులు. ఓ చర్చి సమీపంలోని వ్యాన్​లో బాంబును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది.

లంకలో మళ్లీ పేలుడు..87 డిటోనేటర్లు గుర్తింపు
author img

By

Published : Apr 22, 2019, 6:15 PM IST

Updated : Apr 22, 2019, 7:59 PM IST

లంకలో మళ్లీ పేలుడు- 87 డిటోనేటర్లు గుర్తింపు

ఇప్పటికే వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక వణికిపోతోంది. తాజాగా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 87 బాంబు డిటోనేటర్లు గుర్తించారు అధికారులు. ఇవన్నీ కొలొంబోలోని ఓ బస్​స్టాప్​ సమీపంలో దొరికాయని తెలిపారు.

తనిఖీల్లో మొదటగా 12 డిటోనేటర్లు బయటపడ్డాయి. అదే ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేయగా తర్వాత మరో 75 డిటోనేటర్లను గుర్తించారు.

కాసేపటికే... కొలొంబోలోని ఓ చర్చి సమీపంలోని వ్యాన్​లో పేలుడు సంభవించింది. వ్యాన్​లో బాంబును గుర్తించిన తనిఖీ బృందాలు దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస బాంబుపేలుళ్ల మారణహోమంలో ఇప్పటికే 290 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 22, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.