దక్షిణాసియాలో 5జీ సేవలను అందించే తొలి దేశంగా నిలిచేందుకు నేపాల్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది జులై నుంచి 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది.
భారత్‌లో ఇప్పటి వరకు కచ్చితమైన 5జీ ట్రయల్స్‌ను కూడా నిర్వహించలేదు. నేపాల్ మాత్రం ఆ దేశ రాజధాని కాఠ్మాండూ సహా మూడు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 5జీ సేవలకు ప్రత్యేక ఫ్రీక్వెన్సీని కేటాయించాలనే అభ్యర్థనను ఫిబ్రవరి 1నే సంబంధిత మంత్రిత్వ శాఖ ముందు ఉంచినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే నేపాల్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలుడే అవకాశముంది.
5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు... ముందుగా కావాల్సిన స్పెక్ట్రంను గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించి.. వాటిని విశ్లేషించాలి. విశ్లేషకుల ప్రకారం ఈ ట్రయల్స్‌కు మూడు నెలల నుంచి ఏడాది వరకు పట్టొచ్చు.
ఇదీ చదవండి:ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?