జపాన్ తీరంలో ఉన్న విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో.. వైరస్ సోకని ప్రయాణికులను నౌక నుంచి తరలిస్తున్నారు. ఈ నౌకలో ఇప్పటి వరకు 542 మంది కరోనా వైరస్ సోకింది. 14 రోజుల నిర్బంధ కాలం ముగియసినందున.. దాదాపు వైరస్ సోకని 5 వందల మంది ప్రయాణికులకు నౌక నుంచి వెళ్లేందుకు అధికారులు అనుమతినిచ్చారు.
వీరందరికీ వైరస్ సోకలేదని ధ్రువపత్రం కూడా ఇచ్చారు. హంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి వైరస్ లక్షణాలు కనిపించినందున... మొత్తం 3వేల 711 మందితో కూడిన ఈ నౌకను జపాన్‌లోని యోకొహోమా తీరంలోనే నిలిపివేశారు. అప్పటి నుంచి నౌకను నిర్బంధంలో ఉంచారు.
ఇదీ చదవండి:ఇకపై మా దేశంలో చైనీయులకు నో ఎంట్రీ: రష్యా