నేపాల్‌లోని కాఠ్మాండూలో ఉదయం 5.19 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. సింధుపాల్చోక్ జిల్లా రాంచే వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2015లో సంభవించిన భూకంపం, వరదల తాకిడికి ఇప్పటికే ఈ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడు భూకంపం.. మరోసారి స్థానికుల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
కొన్ని చోట్ల తీవ్ర భూప్రకంపనలు వచ్చినట్లు నేపాల్ భూకంప కేంద్రం(ఎన్సీఎస్) తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా సమాచారం లేదు.
బిహార్‌లోనూ..
నేపాల్‌లో భూకంపం.. సరిహద్దు దేశం భారత్‌పైనా స్వల్పంగా ప్రభావం చూపించింది. ఉత్తరాది రాష్ట్రం బిహార్‌లో ప్రకంపనలు వచ్చాయి. షాక్‌తో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
2015లో సంభవించిన భూకంపం నేపాల్‌ను వణికించింది. 7.9 తీవ్రత నమోదుకాగా.. 10 వేల మందికిపైగా చనిపోయారు. మరో వేలాదిమంది గాయపడ్డారు.