ETV Bharat / international

చైనాలో భూకంపం.. నలుగురు మృతి - china earth quake in telugu

చైనాలో పలుచోట్ల భూకంపం సంభవించింది. 8 కి.మీల లోతున భూమి కంపించి పలు భవనాలు కూలిపోయాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. 10 టెలికాం స్టేషన్లు దెబ్బతిన్నాయి.

4 killed, 24 injured as quake hits China
చైనాలో భూకంపం.. నలుగురు మృతి!
author img

By

Published : May 19, 2020, 11:00 AM IST

యావత్​ ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ.. చైనాను మరో విపత్తు సంభవించింది. యున్నాన్​ రాష్ట్రం​లో భూకంపం వచ్చింది. నలుగురు మృతి చెందారు. 24 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కియాజియా కౌంటీలో రిక్టర్​ స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇది సుమారు 8 కి.మీల లోతులో సంభవించినట్లు చైనా భూకంపకేంద్రం ప్రకటించింది.

కుజింగ్​ నగరంలోని హుయిజ్ కౌంటీతో పాటు జాటోంగ్, జువాన్వీ, చుక్సీయాంగ్-ఈ అటానమస్ ప్రిఫెక్చర్ నగరాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపంతో సుమారు 10 టెలికాం స్టేషన్లు దెబ్బతిన్నాయి. వెంటనే చుట్టుపక్కల 16 పట్టణాలకు విపత్తు సహాయ దళాలను పంపింది ప్రభుత్వం.

ఇదీ చదవండి:కశ్మీర్​ విషయంలో తలదూర్చం: తాలిబన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.