నేపాల్లో భారీగా వరదలు(Nepal floods) పోటెత్తి, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా.. గత 20 రోజుల్లో 38 మంది మృతిచెందారని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 50 మందికిపైగా గాయపడ్డారని పెర్కొంది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ముగ్గురు చిన్నారులతో కలిపి 24 మంది గల్లంతయ్యారని హోంశాఖ చెప్పింది. 1,250 మందికి ప్రభుత్వం పునరావాసం కల్పించినట్లు తెలిపింది. జిల్లాల వారీగా ఎంతమంది మరణించారనే దానిపై వివరణ ఇచ్చింది.
మొత్తంగా వరదల విలయానికి 790 ఇళ్లు, 90 పశువుల పాకలు, 19 వంతెనలు కూలిపోయినట్లు హోంశాఖ తెలిపింది.
ఇదీ చదవండి:విలయం సృష్టిస్తున్న వరదలు- 16 మంది మృతి