ETV Bharat / international

రెండు పడవలు ఢీ- 32 మంది మృతి - Boat accident in Bangladesh

బంగ్లాదేశ్​ ఢాకా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బూరీగంగా నదిలో రెండు పడవలు ఢీకొని 32 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు.

32 people drown as ferry capsizes in Bangladesh's Buriganga river
బంగ్లాదేశ్​ నదిలో పడవ మునక.. 32 మంది మృతి
author img

By

Published : Jun 29, 2020, 4:03 PM IST

బంగ్లాదేశ్​లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. ఢాకా సమీపంలోని శ్యామ్​బజార్ ప్రాంతంలో బూరీగంగా నదిలో 100 మందితో వెళ్తున్న ఓ పడవ... ఎదురుగా వస్తున్న మరో లాంచీని ఢీకొట్టగా ఈ పెను విషాదం జరిగింది.

వీరు గల్లంతు... వారు మాయం

మున్షీగంజ్​ నుంచి ఢాకాకు ప్రయాణిస్తోన్న 'మార్నింగ్​ బర్డ్​' పడవ సాదర్​ఘాట్​ వద్ద.. 1000 మంది ప్రయాణికులతో కూడిన 'మొయూర్​-2' లాంచీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 'మార్నింగ్​ బర్డ్​' బోల్తాపడింది. కొంతమంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా... మిగిలినవారు మునిగిపోయారు.

ఇప్పటివరకు 25 మంది పురుషులు, అయిదుగురు మహిళలు, ఇద్దరు పిల్లల మృత దేహాలను వెలికితీశారు అధికారులు. మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

'మొయూర్​-2' లాంచీ సిబ్బంది, అందులోని ప్రయాణికులు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు. వారు ఎటు వెళ్లారన్న అంశంపై స్పష్టత లేదు.

కారణమేంటి?

డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బంగ్లాదేశ్​ లోతట్టు జల రవాణా శాఖ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: రష్యాలో కనువిందు చేసిన బాణాసంచా కాంతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.