ETV Bharat / international

మరో నగరంలో కరోనా పరీక్షలకు సిద్ధమైన చైనా

మరో నగరంలో సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో రష్యా సరిహద్దు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపింది.

2nd Chinese city orders mass testing for COVID-19 after Wuhan
మరో నగరంలో కరోనా పరీక్షలకు సిద్ధమైన చైనా
author img

By

Published : Jun 4, 2020, 1:00 PM IST

వుహాన్​ నగర వ్యాప్తంగా కరోనా పరీక్షలు ముగించిన చైనా.. మరో నగరంలో పరీక్షలు చేయటానికి సిద్ధమైంది. 2.8 మిలియన్ల (28 లక్షలు) జనాభా కలిగిన గుయంగ్​డోంగ్ నగరంలో పరీక్షలు చేయనున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ సందర్భంగా రష్యా సరిహద్దును తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది.

రష్యా నుంచి తిరిగి వచ్చిన కొంత మంది కారణంగా ఏప్రిల్​, మే నెలలో చైనాలోని వివిధ నగరాల్లో కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు భావిస్తున్నారు. ముదాంజియాంగ్ ప్రాంతంలో 15 లక్షణాలు కనపడని కేసులు నమోదైన కారణంగా ఈ నగరంలోనూ పరీక్షలను నిర్వహించాలని చైనా భావిస్తోంది.

వుహాన్​లో సామూహిక పరీక్షల అనంతరం 300 వరకు లక్షణాలు లేని ​ కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరో నాలుగు కొత్త లక్షణాలు కనపడని ​ కేసులు నమోదైనట్లు తెలిపిన ఆ దేశ అధికారులు.. ఇప్పటి వరకు 326 ఈ తరహా కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. దీంతో చైనా వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 83,022కు చేరింది.

ఇదీ చూడండి:40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.