ETV Bharat / international

పాక్​లో బాంబు పేలుడు.. 25 మందికి గాయాలు - గంజ్​ మండి పోలీస్​ స్టేషన్

పాకిస్థాన్​ రావల్పిండిలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. రావల్పిండిలో 10 రోజుల వ్యవధిలో ఈ తరహా పేలుడు జరగడం ఇది రెండోసారి.

blast in pakisthan ravalpindi
పాక్​లో బాంబు పేలుడు-25 మందికి గాయాలు
author img

By

Published : Dec 13, 2020, 8:30 PM IST

పాకిస్థాన్​ రావల్పిండిలో ఆదివారం.. బాంబు పేలుడు సంభవించింది. గంజ్​ మండి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటనలో.. దాదాపు 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 22 మందిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురికి ఘటనాస్థలంలోనే ప్రథమ చికిత్స అందించినట్లు చెప్పారు.

ఈ పేలుడును గ్రనేడ్​ దాడిగా భావిస్తున్నామని రావల్పిండి నగర పోలీసు అధికారి(సీపీఓ) మహమ్మద్​ అహ్సన్​ యూనస్​ తెలిపారు. అయితే దీన్ని నిర్ధరించాల్సి ఉందని అన్నారు. నగరంలో.. పదిరోజుల వ్యవధిలో ఈ దాడి జరగడం రెండో సారి అని చెప్పారు.

డిసెంబర్​ 4న పిర్​ వహాదీ స్టేషన్​ పరిధిలో జరిగిన పేలుడులో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారని యూనస్​ చెప్పారు. ఇది ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నామని అన్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:పాక్​ దుశ్చర్య- దీటుగా బదులిచ్చిన భారత సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.