చైనా యోంగ్ చువాన్ జిల్లాలోని డయాచువాన్ బొగ్గుగనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరినట్లు అధికారులు తెలిపారు. చెత్తను తొలగించే క్రమంలో 24మంది కార్మికులు ప్రమాదవశాత్తు గనిలో చిక్కుకున్నారు. వీరిలో శనివారం 18 మంది మృతించెందారు. ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు.
కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదల అవ్వటం కారణంగా కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.
ఇదీ చదవండి: గనిలో చిక్కుకుని 18మంది మైనర్లు మృతి