ETV Bharat / international

ముష్కరుల మధ్య అంతర్గత దాడి- 12 మంది మృతి

author img

By

Published : Jan 16, 2021, 2:48 PM IST

అఫ్గాన్​లో ఉగ్రవాద సంస్థల మధ్య జరిగిన అంతర్గత దాడిలో 12 మంది ముష్కరులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్​ ప్రతినిధి ఒకరు ట్వీట్​ చేశారు.

kill 12 Afghan militiamen
ముష్కరుల మధ్య అంతర్గత దాడి- 12 మంది మృతి

అఫ్గానిస్థాన్​లో ఉగ్రవాద ముఠాల మధ్య అంతర్గత కలహం.. 12 మంది ముష్కరుల మృతికి దారి తీసింది. పశ్చిమ హెరాత్​ ప్రావిన్స్​లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న ముష్కరులు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పారిపోయారని అఫ్గాన్​ పోలీసు అధికారి అబ్దుల్ అహాద్ వాలిజాడా తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతం తమ సైనిక దళాల ఆధిపత్యంలోనే ఉందని వివరించారు.

ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్​ ప్రతినిధి యూసఫ్​ అహ్మది ఓ ట్వీట్​లో పేర్కొన్నారు.

మరో ఘటన..

శనివార అఫ్గాన్​ రాజధాని కాబూల్​కు పశ్చిమ భాగంలో పోలీసులు ల్యాండ్​ క్రూజర్​ ఎస్​యూవీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందగా.. కాబూల్​ ఛీఫ్​ మావ్లానా బయాన్​ గాయపడినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదు.

దక్షిణ హెల్మాండ్​ ప్రావిన్ల్​లో..

పోలీసులే లక్ష్యంగా దక్షిణ హెల్మాండ్​ ప్రావిన్స్​లో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. లష్కర్​ గహ్​ జిల్లాలో ఈ దాడి జరిగింది. దీనిపై కూడా ఏ ఉగ్రసంస్థ తామే బాధ్యులమని ప్రకటించలేదు.

ఇదీ చూడండి:అమెరికా బ్లాక్​లిస్ట్​లో షియోమీ సహా 9 చైనా కంపెనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.