పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
రావల్పిండి నుంచి 25మంది ప్రయాణికులతో స్కర్దుకు వెళ్తున్న బస్సు గిల్గిట్ సమీపంలోని రువాండూ వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫిరాక్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'మోదీ' బంగ్లాదేశ్ పర్యటన రద్దు.. కారణం ఇదే!