బంగ్లాదేశ్‌లోని నెట్రకోనా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోటు బోల్తాపడిన ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. 30 మంది ప్రాణాలను కాపాడారు భద్రతా సిబ్బంది. ఓ వ్యక్తి ఆచూకీ గల్లంతైంది.
ప్రయాణికుల్లో మదర్సా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
భద్రతా ప్రమాణాల లేమి..
బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. భద్రతా ప్రమాణాలు లోపం, విచక్షణ రహితంగా బోట్లను నడపటం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో పరిమితికి మించి ప్రయాణికుల రవాణా చేసిన కేసులే అధికంగా ఉన్నాయి. రాజధాని ఢాకాలో జూన్‌లో జరిగిన ఓ బోటు ప్రమాదంలో 32 మంది చనిపోయారు.