ETV Bharat / international

లాక్​డౌన్​లో బర్త్​డే పార్టీ.. రూ. లక్షల్లో జరిమానా​

author img

By

Published : Jul 11, 2020, 6:22 AM IST

పుట్టినరోజు సందర్భంగా కొందరు యువకులు ఒకచోటుకు చేరారు. పార్టీ చేసుకోవాలనుకొని.. ఓ ప్రముఖ రెస్టారెంట్​లో ఫుడ్​ ఆర్డర్​ చేశారు. అలా సరదాగా గడపాలనుకున్న వారి ఆశలు.. కొద్దిసేపటికే ఆవిరయ్యాయి. అసలేం జరిగిందంటే..

16 Australians fined for 26,000 dollars for defying lockdown by celebrating birthday party
లాక్​డౌన్​లో బర్త్​డే పార్టీ.. 13 లక్షల జరిమానా​

ఆస్ట్రేలియా- మెల్​బోర్న్​లో లాక్​డౌన్​ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా కొంతమంది యువకులకు భారీ జరిమానా విధించారు పోలీసులు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్టీ చేసుకుంటున్న 16 మంది యువకులకు 26,000 ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.13.57 లక్షలు) జరిమానా కట్టాలని ఆదేశించారు.

ఇలా దొరికారు!

డాండెనాంగ్​ ప్రాంతంలో ఓ యువ బృందమంతా కలిసి సరదాగా పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ప్రముఖ కేఎఫ్​సీ రెస్టారెంట్​కు ఇద్దరు వ్యక్తులు వెళ్లి 20 మంది కోసం రాత్రి 1.30 గంటలకు ఫుడ్ ఆర్డరు ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించిన ఆరోగ్య సిబ్బంది ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కేఎఫ్​సీ ద్వారా వారి వివరాలు తెలుసుకున్న విక్టోరియా పోలీసులు.. సంబంధిత చిరునామాకు వెళ్లారు. బర్త్​డే పార్టీలో ఉన్న 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. లాక్​డౌన్​ నిబంధనల ప్రకారం వీరికి జరిమానా విధించారు.

వీటికి మాత్రమే సడలింపు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వ్యాప్తంగా రెండోదశ లాక్​డౌన్​ అమల్లో ఉంది. అయితే వ్యాయామం, నిత్యవసర వస్తువుల కొనుగోలు, ఉపాధి, వైద్య సహాయం కోసం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

ఇదీ చదవండి: 'భయపెడుతోన్న మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రమాదకారి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.