ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుడు- 15 మంది మృతి - అఫ్గానిస్థాన్​ కారు బాంబు పేలుడు

అఫ్గానిస్థాన్​లోని నంగర్​హార్​​లో కారు బాంబు బీభత్సం సృష్టించింది. ఘనిఖిల్​ జిల్లా గవర్నర్​ కార్యాలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. ఇందులో 15 మంది మృతిచెందగా మరో 30 మంది గాయపడ్డారు.

15 people killed, over 30 injured in car bomb explosion in Afghanistan
అఫ్గానిస్థాన్​లో కారు బాంబు పెలుడు- 15మంది మృతి
author img

By

Published : Oct 3, 2020, 5:51 PM IST

అఫ్గానిస్థాన్​లో శనివారం మధ్యాహ్నం జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మృతి చెందారు. మరో 30 మంది క్షతగాత్రులయ్యారు. నంగర్​హార్ రాష్ట్రం ఘనిఖిల్​ జిల్లా గవర్నర్​ కార్యాలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.

8 మంది పౌరులు..

నంగర్​హార్​​ జిల్లా గవర్నర్​ కార్యాలయ ప్రతినిధి ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించారు. కొందరు తుపాకీతో గవర్నర్​ కార్యాలయంలోకి చొరబడ్డారని చెప్పారు. కానీ వారిని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు పేర్కొన్నారు.

అయితే.. ఈ ఘటనలో 8 మంది పౌరులు మృతి చెందినట్లు నంగర్​హార్ రాష్ట్రీయ మండలి​ సభ్యుడు ఒబైదుల్లా షిన్వారీ తెలిపారు.

ఇదీ చూడండి:- 'నవాజ్​ను తిరిగి రప్పించే ప్లాన్ వేయండి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.