నేపాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు నేపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 37కు చేరినట్లు ఆ దేశ హోంశాఖ వెల్లడించింది.
" తాజాగా మృతి చెందిన 15 మంది మ్యాగ్దీ జిల్లాకు చెందినవారు. వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. శుక్రవారం (జులై 10న) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు."
- నేపాల్ హోంశాఖ
సహాయ చర్యలు చేపట్టేందుకు ఆర్మీతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. నారాయణి సహా దేశంలోని ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.
మరో మూడు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి: విరిగిపడిన కొండచరియలు- 22 మంది బలి