చైనా షాంగ్జీ రాష్ట్రంలోని ఓ బొగ్గుక్షేత్రంలో ప్రమాదవశాత్తు గ్యాస్ పేలింది. ఈ ఘటనలో 15మంది బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
35 మంది మైనర్ బాలురు పియాంగో కౌంటీలోని బొగ్గుగనిలో పనిచేసేందుకు భూగర్భంలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అక్కడ గ్యాస్ పేలిందని షాంగ్జీ బొగ్గుగని ప్రాధికార సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో 11 మంది బాలురు సురక్షితంగా తప్పుంచుకున్నారని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రపంచ మేధావుల జాబితాలో మరింత తగ్గిన భారత్ ర్యాంక్